ఇంటర్వ్యూ : నితిన్ – ‘పవన్ కళ్యాణ్’ మీద నాకు ఉన్నది ఫ్యూర్ లవ్ !

Published on Feb 19, 2020 4:45 pm IST

 

‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్నారు. కాగా ఈ సందర్భంగా హీరో నితిన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

పెళ్లి చేసుకోబోతున్నారు. కంగ్రాట్స్.. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నను ఇక మిమ్మల్ని ఎవరు అడగలేరు ?

అవును. ఇక ఆ ప్రశ్న నన్ను ఎవ్వరూ అడగరు. ఫైనల్ గా పెళ్లి అయిపోతుంది కదా.

 

పెళ్లి లేట్ గా అవుతుందననే ఫీలింగ్ ఏమైనా ఉందా ?

నిజం చెప్పాలంటే చాల లేట్ అయింది, మూడు సంవత్సరాలు ముందే చేసుకోవాల్సింది. కానీ, నేను మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది.

 

జనరల్ గా సెలెబ్రెటీ లవ్ స్టోరీ ఎప్పుడూ లీక్ అయిపోతుంది, కానీ మీ విషయంలో అలా జరగలేదు. ఎలా మ్యానేజ్ చేశారు ?

చాల ప్లాన్డ్ గానే మ్యానేజ్ చేశాము అండి. అంటే, ఆ అమ్మాయి మీద మీడియా అటెంక్షన్ వద్దు అని అనుకున్నాము. ఫైనల్ గా మా లవ్ స్టోరీ చాల సీక్రెట్ గా పెట్టగలిగాము.

 

వెంకీ కుడుముల మీకు ‘భీష్మ’ కథ ఎప్పుడు చెప్పారు ?

శ్రీనివాస కళ్యాణం‌ షూటింగ్ జరుగుతున్న టైంలో ఫస్ట్ ‘భీష్మ’ లైన్ చెప్పాడు. ఆ తరువాత ఆ లైన్ ను ఫుల్ స్క్రిప్ట్ గా డెవలప్ చెయ్యడానికి చాల టైం తీసుకున్నాము. అందుకే వన్ ఇయర్ లేట్ గా సినిమాని మొదలు పెట్టాము.

 

‘భీష్మ’లో ఆర్గానిక్ కి సంబంధించి మెసేజ్ కూడా ఉందనుకుంటా. మరి సినిమా ఎలా ఉండబోతుంది ?

సినిమా అంతా లవ్ స్టోరీ, రొమాన్సే అండ్ కామెడీనే ఉంటుంది. అయితే, ఆర్గానిక్ లేయర్ లో ఆ లవ్ స్టోరీ నడ్డుస్తోంది. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ చాల బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు.

 

‘జయం’ నుండి మీరు చేసిన సినిమాల్లో ఎక్కువగా లవ్ స్టోరీలే ఉన్నాయి. చాల లవ్ స్టోరీలు చేసినా కూడా మీకు ఆ జోనర్ బోర్ అనిపించట్లేదా ?

నేను చేసిన సినిమాల్లో ఎక్కువగా లవ్ స్టోరీలు ఉన్నా.. కథలు అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. అయితే ఇక లవ్ స్టోరీలు తగ్గిందాం అనుకున్నాను. కానీ, ‘రంగ్ దే’ కథ విన్నాక లాస్ట్ లవ్ స్టోరీగా ఆ మూవీ చేస్తున్నాను. ఆ కథ చాల బాగుంటుంది, అందుకే దాన్ని వదులుకోలేదు.

 

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది. మీ నుండి వినూత్నమైన సినిమాలు ఆశించొచ్చా ?

నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ 18 సంవత్సరాలు అయింది. నా కెరీర్ గ్రాఫ్ కూడా చాల వేరియేషన్స్ తో సాగింది. మంచి ఎక్స్ పీరియన్స్. ఇక నేను కూడా వినూత్నమైన సినిమా చేయాలని ఉద్దేశ్యంతోనే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారితో ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా చాల కొత్తగా ఉంటుంది.

 

మీరు, మీ సినిమా ప్రమోషన్ కోసమే పవన్ కళ్యాణ్ పేరును మీరు కావాలని మీ సినిమాలో ఇన్ వాల్వ్ చేస్తారు అనే విమర్శ మీ పై ఉంది ?

లేదు అండి. నా ఫస్ట్ సినిమా నుండి పవన్ కళ్యాణ్ గారి సాంగో, ఆయన పోస్టరో, ఆయన మ్యాడులేషనో ఏదో రకంగా ఆయన నా సినిమాలో కనిపిస్తారు. లేదా వినిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఉన్నది ఫ్యూర్ లవ్. ఎవరు ఎన్ని అనుకున్నా నేను ఆయనకి జన్యున్ అభిమానిని.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నాను, జూన్ నుండి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాము. కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ సినిమా కూడా ఆగష్టు నుండి స్టార్ట్ చేస్తాము. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్‌దే’, చంద్ర శేఖర్ యేలేటిగారితో సినిమా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :