ఇంటర్వ్యూ : అర్జున్ అంబటి – ‘పుష్ప’ ఆడిషన్ టైం లో సుకుమార్ గారు ఒక విషయం చెప్పారు

Published on Aug 11, 2021 1:58 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతున్న చిత్రాల్లో హీరోయిన్ పూర్ణ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “సుందరి” కూడా ఒకటి. దర్శకుడు కళ్యాణ్ జి గోగణ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా ఈ సినిమాలో మేల్ లీడ్ లో నటించిన అర్జున్ అంబటి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఇందులో తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం..

చెప్పండి ‘సుందరి’ తో ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యింది?

డైరెక్టర్ కళ్యాణ్ గారు నన్ను సోషల్ మీడియాలో అప్రోచ్ అయ్యారు. అప్పుడు మీట్ అయ్యాను ముందు నార్మల్ ఏదో చిన్న సినిమానే అనుకున్నాను కానీ తర్వాత స్క్రిప్ట్ చెప్పినపుడు లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా ఆ రోల్ లో ట్రావెల్ అయ్యే భర్త రోల్ నాది అందులో కూడా మంచి స్కోప్ ఉంది అని చెప్పడంతో నేను ఓకే చేశాను..

ఏ అంశం మీకు ఈ సినిమా చేసేలా చేసింది?

ఈ సినిమాలో నా రోల్ కి అన్ని షేడ్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ నుంచి నెగిటివ్ వరకు అన్నీ కంప్లీట్ ప్యాకేజీ లా ఉంటుంది. అంతే కాకుండా ఈ సినిమా నేను ఓకే చెయ్యడానికి పూర్ణ గారు కూడా ఒక కారణం.. అలాంటి టాలెంటెడ్ నటితో సినిమా అనగానే చెయ్యాలని ఫిక్స్ అయ్యాను.

మీకు ఇదే ఫస్ట్ సినిమానా ఇంకా ముందు ఉన్నాయా?

లేదు ముందు నేను అర్ధనారి సినిమా చేశాను దానికి మూడు నంది అవార్డ్స్ వచ్చాయి. తర్వాత గోపీచంద్ గారి శౌఖ్యం సినిమాలో విలన్ గా కూడా చేశాను. తర్వాత కూడా చాలానే చేశాను కానీ దేనికి రాణి బజ్ ఈ సినిమాకి వచ్చింది. తర్వాత సీరియల్స్ చేశాను అవి కూడా హిట్టయ్యాయి మళ్ళీ సినిమాలు చేసే అవకాశం వచ్చింది.

స్టార్టింగ్ స్టేజ్ లోనే విలన్ టైప్ రోల్స్ అంటే భయపడతారు ఎవరైనా మీకు అలా ఏమన్నా ఉందా?

నేను అలా ఎప్పుడూ అనుకోలేదు నా ఫస్ట్ సినిమాలోనే గే రోల్ చేశాను.. తర్వాత విలన్ గా చేశాను ఇప్పుడు ఇలా నేను హీరోగా అవుదామనేం రాలేదు ఒక వెర్సటైల్ యాక్టర్ గా అవ్వాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. అందుకే ఎలాంటి రోల్ అయినా చేస్తాను..

ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?

నేను అనుకోకుండా వచ్చాను.. మాది విజయవాడ ఐటీ బ్యాక్ డ్రాప్ లో రెండేళ్లు వర్క్ చేస్తున్న టైం లోనే నా ఫ్రెండ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ అలా ఓ డైరెక్టర్ మీట్ అవ్వడం చిన్న రోల్స్ చెయ్యడం తర్వాత నుంచి అలా చేస్తూ వస్తున్నాను. ఇక అలా అర్ధనారికి వచ్చేసరికి నటనపై ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇప్పటికి అలా కంటిన్యూ అవుతుంది..

పూర్ణ గారితో మీ జర్నీ కోసం చెప్పండి

పూర్ణ గారు ఒక వండర్ ఫుల్ నటి, ప్రస్తుతం అంతా గ్లామరస్ డోస్ ఎక్కువ ఉంది కానీ పూర్ణ గారు మాత్రం ఒక కంప్లీట్ ప్యాకేజ్ నటన, డాన్స్ ఇలా అన్నీ కూడా చాలా బాగా చేస్తారు కానీ ఆమె ఇంకా ఎందుకు సక్సెస్ కాలేదు అన్నది ఇంకా నాకు అర్ధం కాలేదు. ఒకప్పుడు హీరోయిన్స్ సౌందర్య గారు కానీ సంఘవి గారు కానీ ఎలా ఉంటారు డాన్స్ చేస్తారు అద్భుతంగా నటిస్తారు గ్లామర్ అన్ని కూడా చెయ్యగలరు. అలానే పూర్ణ గారు కూడా కానీ తనకి ఇంకా ఎందుకు మంచి సక్సెస్ రాలేదు అన్నది నాకు అంతు చిక్కలేదు.

ఈ సినిమా మీకు మంచి మైల్ స్టోన్ అవుతుంది అనుకుంటున్నారా?

ఖచ్చితంగా అనుకుంటున్నాను, అర్ధనారి తర్వాత నా నటనకి ఈ సినిమా మంచి స్కోప్ ఇచ్చింది. నేనెప్పుడూ ఎలాంటి రోల్ అయినా అది చిన్నది పెద్దది ముసలి వాళ్ళ రోల్ అయినా కూడా చెయ్యడానికి రెడీగా ఉంటాను. రాబోయే డైరెక్టర్స్ ఒక రోల్ అనుకుంటే దానికి అర్జున్ సూట్ అవుతాడురా అనుకునేలా అవ్వాలని నా కోరిక.

సీరియల్స్ చేసేవాళ్ళకి సినిమా ఛాన్స్ లు ఎక్కువ రావు..దీనిపై ఏమంటారు?

ఏమో బహుశా ఉండొచ్చు కానీ సినిమాకి సీరియల్స్ ఒక యాక్టర్ గా ఎలాంటి డిఫరెన్స్ చూపించకూడదని సుకుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను.. లాక్ డౌన్ కి ముందు పుష్ప ఆడిషన్స్ కి వెళ్లాను. అప్పుడు సుకుమార్ గారు నన్ను పిలిచి మాట్లాడడంతో షాక్ అయ్యాను. సీరియల్ కోసం నా సినిమాల కోసం కూడా మాట్లాడారు అప్పుడే ఈ విషయం నేర్చుకున్నాను.

మరి “పుష్ప” సినిమాలో యాక్ట్ చేస్తున్నారా?

లేదు సుకుమార్ గారు ప్రతీ ఒక్కరి గెటప్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు మరి బహుశా అందులో నేను సూట్ అవ్వలేదు అనుకుంటా అందుకే ఆ సినిమాలో చెయ్యట్లేదు.

 

సంబంధిత సమాచారం :