ఇంటర్వ్యూ: శేఖర్ రెడ్డి యెర్రా- టైటిల్ అలా పెడితే, మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు.

Published on Nov 27, 2019 1:57 pm IST

యంగ్ హీరో కార్తికేయ, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 90ఎం ఎల్. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు శేఖర్ రెడ్డియెర్రా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

అసలు ఈ 90ఎంఎల్ కథేమిటీ?

టైటిల్ 90ఎంఎల్ అని పెట్టడం వలన ఇది ఓ తాగుబోతుల చిత్రం లేదా ఆల్కహాల్ కి సంబంధించిన చిత్రం అనుకోవచ్చు. ఇది అలా కాదు. మందు ఖచ్చితంగా తాగాల్సిన అవసరం ఉన్న ఒక పేషెంట్ పాత్రను తీసుకొని సినిమా తీయడం జరిగింది. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన కల్పిత కథ మాత్రమే.

మీకు దర్శకుడిగా మొదటి చిత్రం అనుకుంటా?

అవును…, దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. గతంలో ఐదు సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. చాలా సినిమాలకు రైటర్ గా పనిచేసిన అనుభవం ఉంది. దర్శకత్వ మరియు రైటింగ్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసిన అనుభవం వుంది.

 

కార్తికేయతో మూవీ చేసే అవకాశం ఎలా వచ్చింది.?

ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి నాకు మిత్రుడు. ఆ మూవీ చిత్రీకరణ సమయం నుండే నాకు కార్తికేయతో పరిచయం ఉంది. నేను ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాత ఆయనకు వినిపించడంతో ఈ మూవీ ఒకే చేశారు.

 

టైటిల్ 90ఎంఎల్ అని పెట్టడం వలన ఒక వర్గపు ఆడియెన్స్ సినిమా చూడరేమో కదా?

అంటే ఏ సినిమా అయినా మార్నింగ్ షో పడ్డాక, ఆ మూవీ సబ్జక్ట్ ఏమిటనేది తెలిసిపోతుంది. అలాగే అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా తీయలేం. కొన్ని సినిమాలు యూత్ కి నచ్చితే మరికొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతాయి.

 

ఇలాంటి చిత్రాల వలన మద్యపానం ను ప్రోత్సహించినట్లు అవుతుందేమో?

ఈ చిత్రంలో హీరోకి ఆరోగ్య రీత్యా ఆల్కహాల్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది. అంతేకాని సినిమాలో మద్యపానాన్ని ప్రోత్సహించేలా సన్నివేశాలు కానీ, కామెడీ సన్నివేశాలు కానీ తీయలేదు. 90ఎం ఎల్ కంప్లీట్ లవ్ స్టోరీ. టైటిల్ అలా పెడితే, మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు.

 

హీరో కార్తికేయ పాత్ర ఎలా ఉంటుంది?

కార్తీకేయ నటించిన గత చిత్రాలైన గుణ 369, ఆర్ఎక్స్ 100 లలో యాక్షన్ మరియు ఎమోషనల్ కోణంలోనే అతన్ని ఎక్కువగా చూపించడం జరిగింది. ఈ మూవీలో వాటితో పాటు కామెడీ కూడా కార్తీకేయ చేయడం జరిగింది. కార్తీక్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

 

హీరో, నిర్మాత ఏమైనా మార్పులు చేర్పులు చెప్పారా?

అలా ఏమి చెప్పలేదు. నేను మొదట వారికి నెరేట్ చేసిన స్క్రిప్ట్ యధాతథంగా తెరకెక్కించాను.

 

నెక్స్ట్ ఎవరితో చేస్తున్నారు?

నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఇంకా ఎవరితో కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఈ చిత్రంపైనే. నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. అందుకే ఈ చిత్రం విడుదల తరువాత నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తా.

 

సంబంధిత సమాచారం :