ఇంటర్వ్యూ: జీవన్ రెడ్డి- జార్జి రెడ్డి కథ నేటి తరం విద్యార్థులకు స్ఫూర్తి కావాలి

ఇంటర్వ్యూ: జీవన్ రెడ్డి- జార్జి రెడ్డి కథ నేటి తరం విద్యార్థులకు స్ఫూర్తి కావాలి

Published on Nov 23, 2019 5:41 PM IST

ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అన్యాయం పై పోరాడి అశువులు బాసిన స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జి రెడ్డి నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు జీవన్ రెడ్డి మరియు డైరెక్టర్ అఫ్ ఫోటో గ్రఫీ సుధాకర్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ముందుగా మీ గురించి చెప్పండి?
నాపేరు జీవన్ రెడ్డి మొదట సినిమాగా దళం తీశాను. దళం తీసిన 5ఇయర్స్ తరువాత మళ్ళీ జార్జ్ రెడ్డి తీశాను.

 

జార్జి రెడ్డి మూవీకి వచ్చిన రివ్యూస్ పై మీ స్పందన?
రివ్యూస్ నేను తప్పుబట్టను వారి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చెప్పారు. ప్రతిఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కువుంది. కొందరు పాజిటివ్ గా, కొందరు కొంచెం విమర్శిస్తూ రాశారు. కానీ థియేటర్లో ప్రేక్షకులు మూవీని ఎంజాయ్ చేస్తున్నారు.

 

జార్జి రెడ్డి కథపై భిన్న అభిప్రాయాలు ఉన్నట్లున్నాయి?

జార్జి రెడ్డి కథను మొత్తంగా చెప్పాలంటే మహాభారతం అవుతుంది. అందుకే జార్జి రెడ్డి జీవితంలో జరిగిన ముఖ్య ఘటనల ఆధారంగా తెరకెక్కించాను. దానిలో కొన్నిచోట్ల మిస్టేక్స్ జరిగివుండొచ్చు.

 

ఈ మూవీ ద్వారా మీరు ఏమి చెప్పాలనుకున్నారు?
స్టూడెంట్ లీడర్ గా జార్జి రెడ్డి ఐడియాలాజీ, ఎమోషన్ తెరపై చుపించాలనుకున్నాను. జార్జి రెడ్డి పాత్ర ఎక్కడా తగ్గకుండా ఉన్నతంగా చూపించాను. జార్జి రెడ్డి కథ నేటి తరం స్టూడెంట్స్ తెలుసుకోవాలి. వారికి జార్జి రెడ్డి లాంటి వారు స్ఫూర్తి కావాలి.

 

జార్జి రెడ్డి మూవీపై సెన్సారు వాళ్లు ఎలా స్పందించారు?
సెన్సార్ సభ్యులు ఈ మూవీని చాలా అభినందించారు. ఇలాంటి సినిమాలు రావాలి. దానివలన సమాజంలో ఉన్న కొన్ని చెడు విషయాలపై డిబేట్ నడుస్తుంది అన్నారు.

 

మీరు భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు?

ఖచ్చితంగా ఇలాంటి సినిమాలే తీస్తాను అని చెప్పలేను. కానీ ఉస్మానియా యూనివర్సిటీ కథలు తీస్తాను.

 

1969లో జరిగిన తెలంగాణా ఉద్యమం గురించి సినిమా తీయొచ్చుగా ?
అది ఒక మహా ఉద్యమం దానిని అసంపూర్తిగా తీయలేం. దానికోసం చాలా సన్నద్ధం కావాలి. చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు