ముఖాముఖి : నాగార్జున- హృదయాన్ని హత్తుకునే రాజన్న

ముఖాముఖి : నాగార్జున- హృదయాన్ని హత్తుకునే రాజన్న

Published on Dec 15, 2011 8:16 PM IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు అభిమానించే నటులలో నాగార్జున ఒకరు. ఆయన ప్రజాదరణ బాలీవుడ్ వరకు వెళ్ళింది. అక్కడ అయన కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన ఇటీవలే నటించిన చిత్రం ‘రాజన్న’ విడుదలకి సిద్ధమైంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఏకర్స్ లో ఆయనతో ముచ్చటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన అక్కడే ‘డమరుకం’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన చెప్పిన ముచ్చట్లు మీకోసం.

ప్ర: హలో నాగార్జున్గారు. రాజన్న ఆడియో విజయవంతమైన శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు.

స: (అందంగా నవ్వుతూ) థాంక్స్. నాకు కూడా చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆడియోకి మంచి స్పందన లభిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

ప్ర: రాజన్న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఎలా వచ్చింది?

స: ఇటీవలే ఈ చిత్ర రషెస్ చూడటం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది. చిన్న పిల్లలైతే కన్నీరు పెట్టుకుంటారు. ఈ చిత్రం ఇంత బాగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

ప్ర: మొదట్లో అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు ఇంత ఆలస్యంగా విడుధలవడానికి గల కారణం చెప్తారా?

స: ఈ చిత్రంలో చాలా గ్రాఫిక్ వర్క్స్ మరియు CGI వర్క్స్ ఉపయోగించడం జరిగింది. సినిమా చాలా బాగా తీయాలని మేం భావించాం. కొంత ఆలస్యమై నవంబరు లో విడుదల చేయాలని  నుకున్నాం. కానీ నవంబరులో సినిమాలు విడుదల చేయడానికి సరైన సమయం కాదని డిస్ట్రిబ్యుటర్స్ సూచించడంతో నా అద్రుష్ట తేదిన విడుదల చేయబోతున్నాం. (నవ్వుతూ)

ప్ర: ఈ చిత్రంలో మీకు నచిన సన్నివేశం ఏమిటి?

స: చాలా ఉన్నాయి. ఉదాహరణకి రాజన్న తన ప్రాణ స్నేహితులతో ఉండే భాగం. ఆ సన్నివేశాలు విజయేంద్ర ప్రసాద్ గారు బాగా తీసారు. అధ్బుతమైన డైలాగులు మరియు కథనం ప్రేక్షకులని కట్టిపడేస్తాయి.

ప్ర: ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు బాగా తీసారని మాకు సమాచారం అందింది. అది ఎంతవరకు నిజం?

స: అవును. ఆ సన్నివేశాలకు రాజమౌళి గారు దర్శకత్వం వహించారు. దాని ఫలితం తెరపై అధ్బుతంగా వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూడాలని ఆత్రుతగా ఉంది. క్లైమాక్స్ ఫైట్ ప్రతేకంగా వేసిన సెట్లో నెల రోజులు చిత్రీకరించడం జరిగింది.

ప్ర: రాజమౌళి గారితో పనిచేయడం ఎలా అనిపించింది?

స: రాజమౌళి అధ్బుతమైన దర్శకుడు. ఆయన ఈ చిత్రం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫైట్స్ తీర్చిదిద్దారు. ఆయన ప్రతి నటుడుకి ఎలా చేయాలో చేసి చూపించిన తరువాతే మిగతా నటులతో చేయించే వారు. ఆయనకీ చాలా ఓపిక కూడా ఎక్కువ. చిన్నపిల్లలతో కూడా కష్టపడి చేయించుకున్నారు. ఆయన పడిన శ్రమంతా ఈ రోజు తెరపై కనపడుతుంది.

ప్ర: రాజన్న గెటప్ ఎవరు డిజైన్ చేసారు?

స: రాజన్న గెటప్ సింహంలా ఉండాలని దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ గారు కోరడం జరిగింది. రాజమౌళి మరియు రమా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ గెటప్ మరియు దుస్తులు అవి డిజైన్ చేసారు. నేను బాగా ఉండటం జుత్తు కూడా పొడుగ్గా ఉండేలా డిజైన్ చేయడంతో నాకు బాగా సరిపోయింది.

ప్ర: ఈ చిత్రం కోసం ఏదైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా?

స: అవును తీసుకున్నాను. రాజన్న గురించి గూగుల్ లో సమాచారం సేకరించడం జరిగింది. ఉదాహరణకు గ్రామంలో వేసిన పాకలు ఎలాంటి సిమెంటు లాంటివి వాడకుండా పూర్తి మట్టితో నిర్మించడం జరిగింది. ఇలాంటివి చాలానే ఉన్నాయి.

ప్ర: ఈ చిత్రంలో నటించిన ఏనీ గురించి చెప్పండి?

స: ఆ పాప చాలా చాలా బాగా నటించింది. గతంలో ఆ పాప విక్రమార్కుడు చిత్రంలో నటించడం జరిగింది. ఈ చిత్రానికి ఆ పాప పాత్ర వెన్నెముక లాంటిది. ఆ పాపతో ఒక్క సన్నివేశంలో కూడా నటించలేకపోయినందుకు బాధగా ఉంది. అంత బాగా చేసింది.

ప్ర: చైతన్య నటించిన గత చిత్రాలు పరాజయం చవిచూసాయి. మీరు ఎలా అనుకుంటున్నారు?

స: నేను మాత్రం ఏం చేయగలను దర్శకులని, నిర్మాతలని తిట్టడం తప్ప. అతను తీసుకునే నిర్ణయాల్లో కూడా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. వాటి నుండి నేర్చుకుంటాడు అని ఆశిద్దాం.

ప్ర: అఖిల్ గురించి చెప్పండి?

స: అతను ఇంకా చిన్న పిల్లాడు. ప్రస్తుతం తను చదువుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం. అప్పటివరకు తను ఏం చేయాలి అనుకునే దానిలో స్పష్టత వస్తుంది.

ప్ర: మీరు భవిష్యత్తులో చేయబోయే చిత్రాలు?

స: ‘షిర్డీ సాయి బాబా” చిత్రాన్ని జనవరి 25 నుండి ప్రారంభించాలని అనుకుంటున్నాం. దాని కోసం పెట్టుడు గడ్డం కాకుండా గడ్డం పెంచాలని నిర్ణయించుకున్నాం. దాని తరువాత దశరద్ తో ఒక చిత్రం చేయబోతున్నా. అనుకోకుండా రాజన్న మరియు డమరుకం రెండు చిత్రాలు ఆలస్యమయ్యాయి. ఇవే కాకుండా పౌరాణిక పాత్రలు జానపద పాత్రలు చేయాలని కూడా ఉంది. త్వరలో అవి కూడా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా.

ఇంతటితో నవ మన్మధుడు ఈ ముఖాముఖి ముగించి డమరుకం చిత్ర షూటింగ్ కి వెళ్ళిపోయారు. రాజన్న చిత్రం భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు