ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – సిగ‌రెట్ తాగితే బోల్డ్ ఎలా అవుతుంది !

ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – సిగ‌రెట్ తాగితే బోల్డ్ ఎలా అవుతుంది !

Published on Aug 6, 2019 5:16 PM IST

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం మ‌న్మ‌థుడు 2. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మరి సినిమా గురించి రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు రకుల్ మాటల్లోనే..

 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

ఈ సినిమాలో నేను అవంతిక అనే పాత్రలో కనిపిస్తాను. క్యారెక్టర్ లోనే ఫన్ అండ్ ఎనర్జీ ఉంటుంది. సింగిల్ వర్డ్ లో చెప్పుకుంటే.. అవంతిక సరదాగా గడిపేసే నేటి అమ్మాయి, అలాగే కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించే అమ్మాయి కూడా. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా నాకు చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అందరూ చెప్పే మాటే అని అనుకోకపోతే.. నేను ఇదివరకూ ఎప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఖచ్చితంగా ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను.

 

కానీ మీ క్యారెక్టర్ కాస్త బోల్డ్ గా ఉన్న‌ట్లు అనిపిస్తోంది ?

ఈ సినిమాలో నేను సిగ‌రెట్ తాగే షాట్ ను దృష్టిలో పెట్టుకుని.. బోల్డ్ గా ఉంది అనుకుంటున్నారా..? అయినా సిగ‌రెట్ తాగితే బోల్డ్‌ నెసేనా. సిగ‌రెట్ తాగే అల‌వాటు ఉన్నంత మాత్రాన అవంతిక క్యారెక్టర్ బోల్డ్ కాదు. ఆ విషయం రేపు మీరు సినిమా చూసాక అర్ధమవుతుంది.

 

 

ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైన్ గా సాగుతుందా.. సినిమా కథ ఏంటి ?

కథ ముందే ఎలా చెప్తారు. లైన్ వైజ్ గా చెప్పుకుంటే… హీరో కంటే.. హీరోయిన్ ఇరవై ఐదేళ్ళు చిన్నది. మరి వారిద్దరీ మధ్య ప్రేమ ఎలా పుట్టింది.. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అనేదే మిగతా కథ. సినిమా చూసి తెలుసుకొండి.

 

 

మొదటసారి నాగార్జునగారితో కలిసి నటించారు. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది ?

అద్భుతంగా ఉంది. నాగ్ సార్ తో కలిసి పని చేయడం.. అది కూడా ఆయన పక్కన హీరోయిన్ గా నటించడం.. నిజంగా నాకు ఇది గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఇక కో స్టార్ లకు నాగ్ సర్ చాలా సపోర్ట్ చేస్తారు. చాల నైస్ పర్సన్. స్టోరీని నమ్మడంలో ఆయన తరువాతే ఎవరైనా.. కథ ఆయన ఫైనల్ చేశాక.. దర్శకుడుకి పూర్తి స్వేచ్ఛని ఇస్తారు.

 

 

ఇంతకీ మీరు ‘మన్మధుడు’ చూశారా

ఇంతకుముందు చూడలేదు. ‘మన్మధుడు 2’లో నటించడానికి అంగీకరించాక చూసాను. నాకు చాలా బాగా నచ్చింది.

 

 

ఈ సినిమా దర్శకుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ గురించి..?

రాహుల్ ర‌వీంద్ర‌న్ ను నేను దర్శకుడిగా కంటే కూడా, రాఖీ బ్రదర్ గానే చూస్తాను. రాహుల్ నాకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ నుండి తెలుసు. కానీ తనతో కలిసి పని చేయడం మాత్రం ఇదే మొదటిసారి. స్క్రిప్ట్ మీద తనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. అంత బాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటాడు. సినిమాలో నటినటులందరికీ షూటింగ్ కి ముందే స్క్రిప్ట్ పంపిస్తాడు. అందరికీ ప్రతిది క్లారిటీగా ఎక్స్ ప్లేన్ చేస్తాడు. అందుకే తక్కువ డేస్ లోనే సినిమాని పూర్తి చేశాడు.

 

 

స్టార్ హీరోయిన్లంతా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. మరి మీకు చేయాలనే ఆలోచన లేదా ?

ఎందుకు లేదు. నాకే కాదు, ఎవరికైనా చేయాల‌నే ఉంటుంది. అయితే మంచి స్క్రిప్ట్ లు రావాలి. అప్పుడే అలాంటివి సక్సెస్ అవుతాయి. అయినా నా దగ్గరికీ వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. అన్ని ర‌కాల చిత్రాలూ చేయాలనుకున్నా టైమ్ స‌రిపోవ‌డం లేదు.

 

 

మీ తదుపరి సినిమాలు గురించి ?

తెలుగులో నితిన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో నేను ఓ క్రిమినల్ లాయర్ గా కనిపిస్తాను. అలాగే ‘ఇండియన్ 2’లో సిద్దార్థ్ జోడిగా నటిస్తున్నాను. ఇక హిందీలో కూడా మరో సినిమాకి సైన్ చేసాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు