వెంకటేష్ గారి ‘సైంధవ్’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది – నిర్మాత వెంకట్ బోయనపల్లి

వెంకటేష్ గారి ‘సైంధవ్’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది – నిర్మాత వెంకట్ బోయనపల్లి

Published on Jan 5, 2024 11:24 PM IST


టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ 75 వ మూవీ సైంధవ్. యువ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ బోయనపల్లి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

సైంధవ్ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?
వెంకటేష్ గారు నాకు ఇష్టమైన హీరో. నాని గారితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్న సమయంలో శైలేష్ కొలను హిట్ ట్రైలర్ చూశాను. అది నాకు, నాని గారికి చాలా నచ్చింది. అప్పటికే నాకు శైలేష్ తో పరిచయం వుంది. వెంకటేష్ గారితో కలసి సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. శైలేష్, వెంకటేష్ గారిని కలిశాడు. వాళ్ళిద్దరి వేవ్ లెంత్ చక్కగా కలిసింది. శైలేష్ చెప్పిన కథ వెంకటేష్ గారికి చాలా నచ్చింది. 24 గంటల్లో ప్రాజెక్ట్ ఓకే అవ్వడం నాకూ చాలా సర్ ప్రైజ్ గా అనిపించింది. వెంకటేష్ గారి 75వ చిత్రం చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇది వెంకటేష్ గారి 75వ చిత్రమని మీకు ముందే తెలుసా ?
వెంకటేష్ గారితో కలసి పని చేయాలని నా కోరిక. దర్శకుడు శైలేష్ ఒక్కడే వెళ్లి ప్రాజెక్ట్ ఓకే చేయించుకొని వచ్చాడు. ఈ విషయంలో క్రెడిట్ అతనికి దక్కుతుంది. ఇది వెంకటేష్ గారి 75వ చిత్రమని తెలుసు. అయితే ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది తెలీదు. మా ప్రయత్నం మేము చేశాం. ఇదే విషయం వెంకటేష్ గారి చెప్పాను. ఇదంతా డెస్టినీ అని వెంకటేష్ గారు అన్నారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా ఇలా భారీ తారాగణం వుంది కదా బడ్జెట్ పరంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా అనిపించిందా ?
ఈ కథ చాలా పెద్దది. కథ అనుకున్నప్పుడే ఇది ఎక్స్పెన్సివ్ మూవీ అని తెలుసు. కథకు తగట్టుగా చాలా గ్రాండ్ గా నిర్మించాం.

సంక్రాంతికి ఫ్యామిలీ కథలు రావడం వేరు ఇలాంటి యాక్షన్ కథలు రావడం అరుదు కదా ?
సైంధవ్ చూస్తున్నప్పుడు అందులోని అద్భుతమైన ఎమోషన్ కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమా చూసి బయటికి వస్తున్ననప్పుడు ప్రేక్షకుడి కళ్ళల్లో గొప్ప భావోద్వేగంతో కూడిన కంటతడి కనిపిస్తుంది. సైంధవ్ న్యూ ఏజ్ యాక్షన్ తో కూడిన మంచి ఫ్యామిలీ సినిమా. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.

వెంకటేష్ గారు చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రమోషన్స్ లో కాలేజీ ఈవెంట్స్ కి హాజరవ్వడం ఎలా అనిపించింది ?
వెంకటేష్ గారు చాలా సరదాగా వుంటారు. సినిమా కంటెంట్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ఆయన సహజంగానే చాలా యాక్టివ్ గా వుంటారు. ప్రమోషనల్ ఈవెంట్స్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు.

మీ చిత్రాలలో మ్యూజిక్ ని కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నారు కదా ?
ఏదైనా సబ్జెక్ట్ ని బట్టి వుంటుంది. శ్యామ్ సింగరాయ్ కి సాఫ్ట్ మ్యూజిక్ కావాలి. మిక్కీ జే మేయర్ చక్కని మ్యూజిక్ ఇచ్చారు. సైంధవ్ యాక్షన్, ఎమోషన్ లార్జర్ గా వుంటాయి. సంతోష్ నారాయణ్ చాలా అద్భుతంగా చేశాడు.

వెంకీ 75 వేడుక ఆలోచన ఎవరిది ?
ఇది రానా గారి ఆలోచన. సినిమా మొదలుపెట్టినపుడే స్పెషల్ చేయాలని అనుకున్నాం. రానా గారు వేడుక ఆలోచన చెప్పారు. ఆ క్రెడిట్ రానా గారికి దక్కుతుంది.

రవితేజ గారి ఈగల్ వాయిదా మీకే ఎక్కువ హెల్ప్ అవుతుందని వినిపిస్తోంది ?
వాయిదా వేయడం ఆయన గొప్పతనం. ఇది అందరికీ బెనిఫిట్ అవుతుందని భావిస్తున్నాం.

వెంకటేష్ గారు, నాని గారితో మల్టీ స్టారర్ చేయాలనే ఆలోచనలో వున్నారని విన్నాం?
అవునండీ. వెంకటేష్ గారు, నాని గారు నాకు ఇష్టమైన హీరోలు. ఇద్దరితో విడివిడిగా సినిమాలు చేశాను. వారిద్దరితో మల్టీస్టార్ట్ మూవీ చేయాలనేది నా డ్రీమ్. నేను చేయాలని ప్రయత్నిస్తా. ఎవరు చేసినా ఎంజాయ్ చేస్తాను.

ఆల్ ది బెస్ట్
థాంక్యూ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు