దమ్ము షూటింగ్ వాయిదా

దమ్ము షూటింగ్ వాయిదా

Published on Nov 30, 2011 1:33 PM IST


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’ చిత్ర షూటింగ్ పోల్లాచ్చిలో జరగాల్సి ఉండగా అక్కడ వాతావరణం సరిగా లేకపోవడం, సెట్లో జరిగిన ప్రమాదం వల్ల డిసెంబరు 2కి వాయిదా పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సెట్ తీసివేసే క్రమంలో సెట్ కి సంభందించిన ఒకబ్బాయి ఫిట్స్ వచ్చి నీళ్ళలో పడి చనిపోయాడు. అంతకుముందు పోల్లాచ్చిలో ఒక సెట్ వేసారు. భారీ వర్షాల కారణంగా ఆ సెట్ పాడవడంతో షూటింగ్ రద్దు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

డిసెంబరు 2నుండి పోల్లాచ్చిలో కొత్త షెడ్యుల్ ప్రారంభించనట్లు సమాచారం. దమ్ములో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పాత్రలో కనిస్తుండగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా త్రిషా, కార్తీక నటిస్తుండగా ఎన్టీఆర్ తల్లిగా భానుప్రియ చేయబోతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న దమ్ము చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు