‘సేవకుడు’లో సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్ర

‘సేవకుడు’లో సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్ర

Published on Jan 10, 2012 10:00 AM IST


శ్రీకాంత్ హీరోగా నటించిన ‘సేవకుడు’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్రలో నటించారు. కృష్ణ గారు ధనవంతుడైన ఎన్నారై పాత్రలో నటించారు. విదేశాలలో సంపాదించిన డబ్బును ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇండియా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచాలనే వ్యక్తిగా నటించారు. కృష్ణ గారితో కలిసి శ్రీకాంత్ గతంలో ‘వారసుడు’ మరియు ‘రౌడీ అన్నయ్య’ చిత్రాలలో నటించారు. శ్రీకాంత్ ఈ చిత్రంలో కూడా బాగా నటించారని చిత్రం విజయవంతం సాధిస్తుందని కృష్ణ గారు అన్నారు.

శ్రీకాంత్ మరియు ఛార్మి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సముద్ర దర్శకుడు. ఈ చిత్రంలో రాజకీయ అవినీతి పై సంఘంలో జరుగుతున్న పరిస్థితులపై పోరాడే యువకుడిగా శ్రీకాంత్ కనిపించబోతున్నారు. ముత్తినేని సత్యనారాయణ నిర్మాత కాగా శ్రీకాంత్ దేవా సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు