
మేము ముందుగా తెలిపిన సమాచారం ప్రకారం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ దృశ్యం సినిమా రీమేక్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించింది. తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ దాదాపు పుర్తికావచ్చింది. టాకీ భాగం షూటింగ్ ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమె షూటింగ్ జరుపుకోవాలని సమాచారం
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రబృందం త్వరలో పాటల చిత్రీకరణ కోసం వేరే లొకేషన్ కు వెళ్లనుంది. సిరిప్రియ దర్శకురాలు. అలనాటి తార మీనా హీరోయిన్
వైడ్ యాంగిల్ ప్రొడక్షన్స్ మరియు రాజ్ కుమార్ థియేటర్స్ సహకారంతో ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది

