మరోసారి 1 మిలియన్ వ్యూస్ కొట్టిన మెగా హీరో

మరోసారి 1 మిలియన్ వ్యూస్ కొట్టిన మెగా హీరో

Published on Nov 19, 2015 11:28 AM IST

lofer1
కెరీర్ ప్రారంభంలోనే ‘ముకుంద’, ‘కంచె’ లాంటి డిఫరెంట్ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి రెండు సినిమాలను ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చేసిన వరుణ్ తేజ్ తన మూడవ సినిమాని కూడా ఆ రెండు సినిమాలకి సంబంధం లేకుండా చేసిన సినిమా ‘లోఫర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ ని తన మార్క్ మాస్ హీరోగా ప్రెజంట్ చేస్తూ చేసిన సినిమానే లోఫర్. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ లో వరుణ్ తేజ్ మాస్ ప్రెజంటేషన్, తన డైలాగ్ డెలివరీ అందరినీ ఆకట్టుకుంది.

అంతే కాదు ఈ వీడియో యు ట్యూబ్ బాగా పాపులర్ అవ్వడమే కాకుండా, 10 రోజుల్లో 10 లక్షల/1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. వరుణ్ తేజ్ కంచె సినిమా ట్రైలర్ కూడా యు ట్యూబ్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఈ చిత్ర టీం సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఆడియోని డిసెంబర్ 7న రిలీజ్ చేయడానికి సిద్దమైంది. ఈ ఆడియో లాంచ్ కి లోఫర్ టీంతో పాటు మెగా ఫ్యామిలీకి సంబందించిన హీరోస్ కూడా హాజరవుతారని సమాచారం. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో పూరి మదర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ సినిమాలో రేవతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్ర పోషించాడు. వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించే ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానుంది. సి కళ్యాణ్ నిర్మాత.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు