‘కథానాయకుడు’ పది మిలియన్లను దాటేశాడు !

Published on Dec 31, 2018 6:18 pm IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ ట్రైలర్ పది మిళియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.

ఇక ట్రైలర్ లో కొన్ని డైలాగ్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘ధనబలమైతే బలుపులో కనిపిస్తోంది.. కానీ ఇది జనబలం.. ఒక్క పిలుపులో వినిపిస్తోంది’. అనే డైలాగ్ అందరిని ఆకట్టుకుంది.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, పిబ్రవరి 7న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి

సంబంధిత సమాచారం :