100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ స్టార్ చిత్రం

Vijay-puli
తమిళ నటుడు విజయ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘పులి’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. తమిళనాడులో ఒక మారుమూల ప్రాంతంలో దట్టమైన అడవుల మధ్య ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. చింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ ఇంట్రడక్షన్ పాటకోసం ప్రత్యేకంగా 5కోట్లు ఖర్చుపెట్టి సెట్ వేశారు. అన్నీ కలుపుకుంటే ఈ చిత్రానికి దాదాపు 100కోట్ల బడ్జెట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాను ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా వుంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు..

ఈ సినిమాలో శృతిహాసన్ మరియు హన్సిక నాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శింబు మరియు సెల్వకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Exit mobile version