“లైగర్” క్లైమాక్స్ సీన్స్ భారీగా ప్లాన్ చేశారా?

Published on Jul 8, 2021 1:40 am IST

యంగ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ “లైగర్”. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కిక్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు చక్కబడుతుండడంతో తదుపరి షూటింగ్ జరుపుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే లైగర్ క్లైమాక్స్ సీన్స్‌ని భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే లైగర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని, ఇప్పటికే చిత్రీకరణ 65 శాతం పూర్తయిందని చెప్పుకొచ్చారు. అయితే క్లైమాక్స్ సీన్స్ కోసం సుమారు వెయ్యి మందికి పైగా అవసరం ఉందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో షూటింగ్ అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న పని అని విజయ్ అన్నారు. కరోనా థర్డ్ వేవ్ అంశాలను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ ప్లాన్ రెడీ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ చెబుతున్న మాటలు వింటుంటే లైగర్ క్లైమాక్స్ సీన్స్ మాత్రం భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :