బ్రేక్ ఈవెన్ కు చేరువలో 118 !

Published on Mar 5, 2019 10:20 am IST

పటాస్ తరువాత 118 తో కెరీర్ లో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ముఖ్యంగా నైజాం లో ఈ చిత్రం మంచి రన్ ను కనబరుస్తుంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 6కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో మొదటి వారం లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం ఖాయం గా కనిపిస్తుంది. నిన్న సెలువు రోజు కావడం ఈచిత్రానికి బాగా కలిసి వచ్చింది. అలాగే ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలలేకపోవడంతో ఈచిత్రం మంచి లాభాలను రాబట్టుకోనుంది.

కేవి గుహన్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో నివేత థామస్, శాలిని పాండే కథానాయికలుగా నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదలచేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More