మహేష్ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ కు పదిహేనేళ్ళు.!

Published on Apr 28, 2021 10:00 am IST

మన టాలీవుడ్ లో ఇప్పుడున్న ప్రతీ ఒక్క స్టేర్ హీరోకు కూడా సెన్సేషనల్ బ్రేక్ ఇచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి కనీ వినీ ఎరుగని బ్రేక్ ఇచ్చిన చిత్రం “పోకిరి”. ఈ సినిమా టైటిల్ చెప్తే ఇప్పటికీ మహేష్ ఫ్యాన్స్ కు ఆ వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. ఆ స్థాయి ఇంపాక్ట్ ఈ చిత్రం కలుగజేసింది.

దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్ లో కూడా అతి పెద్ద బ్రేక్ గా నిలిచిన ఈ చిత్రం సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. మరి ఈరోజు ఏప్రిల్ 28 నాటికి ఈ చిత్రం విడుదల అయ్యి 15 ఏళ్ళు పూర్తి చేసుకోడంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక్క వసూళ్ల పరంగానే కాకుండా సెంటర్స్ లో కూడా సాలిడ్ రికార్డ్స్ ఇంకా పదిలంగా ఉంచుకుంది.

అప్పట్లోనే 40 కోట్ల షేర్ ను రాబట్టి దక్షిణాదిలోనే ఈ మార్క్ అందుకున్న మొట్ట మొదటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ గా పేరు గాంచింది. అలాగే ఈ సినిమాతోనే హీరోయిన్ ఇలియానాకు కూడా పెద్ద బ్రేక్ వచ్చి తెలుగులో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అలాగే అత్యధిక భాషల్లో రీమేక్ కాబడిన చిత్రంగా కూడా నిలిచింది.

అయితే ఈ సినిమాకు మరో ముఖ్యమైన మెన్షన్ సంగీతం ఇచ్చిన మణిశర్మ అని చెప్పాలి. ఈ పక్కా మాస్ చిత్రానికి అదిరే ట్యూన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మరి స్థాయికి తీసుకెళ్లారు. ఇలా ఎన్నో సంచలనాలు నమోదు చేసిన ఈ ఇండస్ట్రీ హిట్ 15 ఏళ్ళు పూర్తి చేసుకోడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మళ్ళీ మహేష్ మరియు పూరి జగన్ ల కాంబోలో మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :