ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “18 పేజెస్”.!

Published on Jan 27, 2023 8:00 am IST

గత ఏడాదికి ముగింపులా టాలీవుడ్ నుంచి వచ్చిన మంచి హిట్ చిత్రాల్లో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “18 పేజెస్” కూడా ఒకటి. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ఈ చిత్రం నిఖిల్ కెరీర్ లో అదే ఏడాది రెండో హిట్ గా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం ఫైనల్ గా ఈరోజు నుంచి ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా వారు అలాగే ఇంటర్నేషనల్ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఈరోజు నుంచి అధికారికంగా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :