డబ్బింగ్ వర్క్ ను మొదలు పెట్టిన “18 పేజెస్” చిత్రం!

Published on Aug 12, 2021 11:41 am IST


పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో నిఖిల్ సిద్ధార్థ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. ఈ చిత్రం ను గీతా ఆర్ట్స్ పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ కథ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు నేడు మొదలు అయ్యాయి.

ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో లాక్ డౌన్ కారణం గా ఈ చిత్రం షూటింగ్ మరియు విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :