2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో ’18 పేజెస్’ ఉంటుంది – హీరో నిఖిల్

2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో ’18 పేజెస్’ ఉంటుంది – హీరో నిఖిల్

Published on Dec 30, 2022 1:23 AM IST

నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ 18 పేజెస్. సుకుమార్ రైటింగ్స్ సంస్థ తో కలిసి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై యువ నిర్మాత బన్నీ వాసు ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ముందుగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం, మా అందరి ఆనందాన్ని మీతో పంచుకోవాలనే అన్నారు. ఎక్కువగా కమర్షియల్ మూవీస్ ఆడుతున్న తరుణంలో ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎమోషనల్ కథ, కథనాలతో కూడిన మా 18 పేజెస్ మూవీని కూడా ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు థాంక్స్ అన్నారు. ముఖ్యంగా ఈ మూవీ కోసం హీరో నిఖిల్, డైరెక్టర్ సూర్యప్రతాప్ ఎంతో కష్టపడ్డారని అన్నారు.

ఇక సినిమా ఫస్ట్ డే కంటే థర్డ్ డే కలెక్షన్ ఎక్కువ వచ్చింది అంటే మా మూవీకి ఎంతటి మంచి రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చని, మొత్తంగా మన తెలుగు ఆడియన్స్ కి తన తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అన్నారు. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ, ముందుగా ఈ సినిమాని ఆకట్టుకునే లవ్ స్టోరీ గా తీద్దాం అనుకున్నాము, అనంతరం నిర్మాతలు బన్నీ వాసు గారు, అల్లు అరవింద్ గారికి స్టోరీ వినిపించగానే వారు స్టోరీ లో ఫీల్ ని అర్ధం చేసుకుని ఎంతో ఎంకరేజ్ చేసారని అన్నారు. అలానే 18 పేజెస్ రిలీజ్ తరువాత ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతున్నారని, చాలా మంది అయితే స్టోరీ చూస్తుంటే మేమే లవ్ లో పడ్డ ఫీలింగ్ మాకు కలిగిందని చెప్తున్నారని, నిజంగా ఇది మా మూవీకి పెద్ద అప్రీషియేషన్ అని అన్నారు. చూసిన వారే మళ్ళి మళ్ళి చూస్తున్నారు అంటే అదే మా మూవీకి పెద్ద విజయం అని తెలిపారు. మొత్తంగా మా మూవీకి ఇంతటి గొప్ప విజయాన్ని అందించి, ఆదరిస్తున్నందుకు అందరికీ ప్రత్యేకంగా థాంక్స్ తెలిపారు. హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ, కొన్ని సినిమాలు చేస్తున్నపుడు కిక్ వస్తుంది, కానీ 18 పేజెస్ మూవీ చేస్తుంటే ఏదో తెలియని ఒక మంచి ఫీల్ కలిగింది.

అలానే ఆ పాత్ర యొక్క రెస్పాన్స్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా శతమానంభవతి మూవీలో నిత్యా పాత్రకు ఎంత పేరు వచ్చిందో, ఇప్పుడు ఈ మూవీలోని నా పాత్రకు కూడా అంతే పేరు వచ్చిందని, ఇంతగా మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు అనుపమ. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఫీల్ గుడ్ సినిమాలు అలానే హృద్యమైన ఎమోషనల్ లవ్ స్టోరీస్ అడవు అని అంటారు. కానీ దానిని బ్రేక్ చేసి ఇటీవల రిలీజ్ అయిన సీతారామం సూపర్ హిట్ కొట్టింది. అలానే ఆ మూవీ యొక్క క్లైమాక్స్ అందరి మనసులు తాకింది, దాని మాదిరిగా ఇప్పుడు 18 పేజెస్ క్లైమాక్స్ ఎంతో హృద్యంగా ఉందని, ఈ రెండు సినిమాలను ఆడియన్స్ పోలుస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ మూవీ కోసం టీమ్ మొత్తం నాలుగేళ్లుగా పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని, త్వరలో నిఖిల్ ని మా సంస్థలో మరొక రెండు సినిమాలు చేయమని అడిగానని, మా సంస్థలో పార్టనర్ అవ్వమని కూడా కోరామని సరదాగా మాట్లాడుతూ చెప్పారు అల్లు అరవింద్.

మొత్తంగా ఈ మూవీని ఇంతలా ఆదరిస్తున్న ఆడియన్స్ కి ప్రత్యేకంగా ఆయన థాంక్స్ చెప్పారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ, ముందుగా మా సినిమాని ఎంతగానో ప్రమోట్ చేసిన మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలానే మా సినిమా రిలీజ్ అయి వారం గడుస్తున్నప్పటికీ కూడా న్యూస్ పేపర్స్, బుక్ మై షో వంటివి చెక్ చేస్తే ఫస్ట్ డే కంటే కూడా ప్రస్తుతం కొన్ని చోట్ల ఎక్కువ థియటర్స్ లో మూవీ నడుస్తుంది అంటే మీరు మా మూవీకి మీరు అందిస్తున్న ఆదరణ నిజంగా ఎంతో గొప్పదని తెలిపారు. ఇది మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా కాదు, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, నిజంగా ఇటువంటి కథలు ఇలానే చెప్పాలి, ఆ విధంగా ఎంతో గొప్పగా దర్శకడు సూర్య ప్రతాప్ ఈ మూవీ తెరకెక్కించారని అన్నారు. అలానే తన సినీ కెరీర్ లోని టాప్ 5 మూవీస్ లో 18 పేజెస్ మూవీ ఒకటిగా నిలుస్తుందని, ఈ మూవీని నిర్మించిన అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి అలానే టీమ్ మొత్తం ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు నిఖిల్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు