రానా సినిమా బడ్జెట్ రూ.180 కోట్లు !

Published on Jul 4, 2018 8:29 am IST


దగ్గుబాటి రానా భవిష్యత్తులో చేయనున్న క్రేజీ సినిమాల్లో ‘హిరణ్యకశ్యప’ కూడ ఒకటి. పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి సుమారు రూ.180 కోట్ల వరకు ఖర్చవుతుందని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారట.

ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేష్ సింగ్ ఈ సినిమాకు అవసరమైన ఇంద్రలోకం, వైకుంఠం వంటి సెట్స్ ను గీస్తున్నారట. విజువల్ ట్రీట్ గా ఉండబోతున్న ఈ సినిమాను ముందుగా లండన్ లోని ఒక స్టూడియోలో తీద్దామని అనుకున్నా ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు సురేష్ బాబు మీడియాకు తెలిపారు. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది మొదలయ్యే సూచనలున్నాయట.

సంబంధిత సమాచారం :