100 కోట్ల క్లబ్ లో 2.0 హిందీ వర్షన్ !

Published on Dec 4, 2018 8:53 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ 2.0 ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టిస్తుంది. ముఖ్యంగా శని , ఆది వారాల్లో ఈచిత్రం మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ ఈ చిత్రం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 298 కోట్ల గ్రాస్ ను అలాగే ఓవర్శిస్ లో 105కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి 400 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది.

ఇక ఈ చిత్రం అటు బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది. నిన్న ఒక్క రోజే ఈచిత్రం అక్కడ సుమారుగా14కోట్ల షేర్ ను రాబట్టి 5 రోజుల్లో 100కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిన మొదటి తమిళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక అటు ఈ చిత్ర తమిళ వర్షన్ చెన్నై లో 5రోజులకుగాను 11.41 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :