ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన తన ఆఖరి చిత్రమే “జన నాయగన్”. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా నటసింహం బాలయ్య భగవంత్ కేసరి కి రీమేక్ గా తెరకెక్కింది. దీనినే తెలుగులో జన నాయకుడు పేరిట కూడా విడుదలకి సిద్ధం చేశారు.కానీ ఈ సినిమాకి ఊహించిన విధంగా ఎన్నో అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో ఇప్పుడు మరో షాక్ తగిలినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది వరకే ఈ సినిమా ఓటీటీ డీల్ రద్దు అయినట్టు కొన్ని రూమర్స్ వినిపించాయి. అయితే నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు 120 కోట్లు పెట్టి కొన్నట్టు తమిళ సినీ వర్గాల్లో టాక్ ఉంది. అయితే ఇన్ని రోజులు మేకర్స్ ఈ సినిమా విషయంలో అలా నెట్టుకొచ్చారు.
కానీ అసలు సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వకపోతుండడంతో ఈ సినిమాకి చేసుకున్న 120 కోట్ల డీల్ ని ప్రైమ్ వీడియో వారు క్యాన్సిల్ చేసేసినట్టే అని వినిపిస్తోంది. దీనితో మేకర్స్ కి భారీ లాస్ అన్నట్టు టాక్. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ తదితరులు నటించగా అనిరుద్ సంగీతం అందించారు.


