150 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన 2.0 హిందీ వర్షన్ !

Published on Dec 9, 2018 3:49 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన విజువల్ వండర్ 2.0 ఇటీవల విడుదలై రెండు వారంలోకి ప్రవేశించిన కలెక్షన్స్ మాత్రం స్టడీగానే వున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం అటు హిందీలో ఆద్భుతమైన వసూళ్లను రాబడుతూ 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఈ చిత్రం శుక్రవారం 5.85 కోట్లు అలాగే శనివారం 9.15 కోట్ల వసూళ్లను రాబట్టి మొత్తంగా 10 రోజులకుగాను అక్కడ 154.75 కోట్ల షేర్ వసూళ్లను కలెక్ట్ చేసి ‘బాహుబలి 2’ తరువాత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన డబ్బింగ్ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం 10రోజులకుగాను 20.52కోట్ల షేర్ ను రాబట్టింది. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :