హిందీ లో అదరగొడుతున్న 2.0 !

హిందీ లో అదరగొడుతున్న 2.0 !

Published on Dec 10, 2018 11:51 PM IST

‘రోబో’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘2.0’ ఇటీవల విడుదలై రెండో వారంలోకి ప్రవేశించిన హిందీ లో మాత్రం ఇప్పటికి అదిరిపోయే
కలెక్షన్స్ ను రాబడుతుంది. మొదటి వారంలో 137 కోట్ల ను కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఆ తరువాతి మూడు రోజుల్లో 27కోట్లను రాబట్టి 10 రోజులకు166.65 కోట్ల షేర్ ను వసూలు చేసింది. బాలీవుడ్ లో ‘బాహుబలి 2’ తరువాత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన డబ్బింగ్ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ హక్కులను దక్కించుకున్న బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కు మంచి లాభాలు రానున్నాయి.

ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా కొద్దిగా నెమ్మదించిన సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ముఖ్యంగా నైజాంలోనే ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు