30 దేశాలలో ట్రెండింగ్ లో కొనసాగుతున్న టీజర్ !

30 దేశాలలో ట్రెండింగ్ లో కొనసాగుతున్న టీజర్ !

Published on Sep 14, 2018 10:29 AM IST

Robot

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘2.0’ చిత్ర టీజర్ నిన్న విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 24.8 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను సాధించి కొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్ తో చాలా గ్రాండియర్ గా వున్న ఈటీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఒక్క భారత్ లోనే కాకుండ 30 దేశాల్లో ఈ టీజర్ ట్రెండింగ్లో కొనసాగుతుంది.

బంగ్లాదేశ్, యుఏఈ , నేపాల్, ఖతార్ వంటి దేశాల్లో ఈ చిత్ర టీజర్ అక్కడి యూట్యూబ్లో పాపులర్ అవుతుంది. శంకర్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. అత్యంత భారీ బడ్జెట్తో ఎన్నడూచూడని విజువల్ ఎఫెక్ట్స్ తో రానుంది ఈ చిత్రం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రనికి ఏ ఆర్ రహమేన్ సంగీతం అందిస్తున్నారు. మూడు భాషల్లో ఈ చిత్రం నవంబర్ 21న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు