షాంగై ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2.0

Published on Jun 13, 2019 12:00 am IST

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘2.0’. గత ఏడాది నవంబర్లో రిలీజైన ఈ సినిమా దక్షిణాదిన మాత్రమే కాకుండా ఉత్తరాదిన కూడా భారీ విజయాన్ని అందుకుంది. ‘బాహుబలి, దంగల్’ సినిమాల ప్రభావం వలన ఇండియన్ సినిమాలకు చైనాలో భారీగా ఆధారం పెరిగింది. దీంతో పలు ఇండియన్ సినిమాలు ఇప్పటికే చైనా భాషలోకి అనువాదమై మంచి కలెక్షన్స్ రాబట్టాయి.

ఆ బాటలోనే ‘2.0’ కూడా జూలై 12వ తేదీన చైనాలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఐమాక్స్ త్రీడీ ఫార్మాట్లో భారీ ఎత్తున రిలీజవుతున్న మొదటి ఇండియన్ సినిమా కూడా ఇదే. విడుదలకు సంబందించిన ప్రెస్ మీట్స్ ముంబై, చైనాలలో జరగనున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాను జూన్ నెలలో జరగనున్న ప్రముఖ షాంగై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఆసియాలో జరిగే ప్రముఖ ఫెస్టివల్‌లో షాంగై ఫిల్మ్ ఫెస్టివల్‌ కూడా ప్రముఖమైనది.

సంబంధిత సమాచారం :

More