భారీ స్థాయిలో ‘భరత్ అనే నేను’ ప్రీమియర్ షోలు !

6th, April 2018 - 09:22:31 AM

మహేష్ బాబు సినిమాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ఓవర్సీస్లో కూడ అదే స్థాయి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ మూలానే ఆయన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు మంచి ఓపెనింగ్స్ కోసం విడుదల ముందురోజు 19వ తేదీ రాత్రి అమెరికా వ్యాప్తంగా సుమారు 2000 ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు.

ఈ భారీస్థాయి విడుదల వలన రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం చిత్రం భారీ స్థాయిలోనే రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వం కావడం, మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో గట్టి నమ్మకాలు, అంచనాలున్నాయి. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక రేపు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనుంది.