“2018” తెలుగులో డే 1 వసూళ్లు ఎంతంటే.!

“2018” తెలుగులో డే 1 వసూళ్లు ఎంతంటే.!

Published on May 27, 2023 1:09 PM IST


లేటెస్ట్ గా మళయాళ ఇండస్ట్రీ దగ్గర సంచలనం రేపిన సెన్సేషనల్ హిట్ చిత్రం “2018” కోసం తెలిసిందే. మరి మళయాళంలో ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ చిత్రం ఆల్రెడీ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా నిన్న ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చింది. ఇక తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ నే అందుకున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా తెలుగులో మొదటి రోజు అయితే సుమారు 1.01 కోట్ల గ్రాస్ ని అందుకుందంట. దీనితో అయితే ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ నే నమోదు చేసింది అని చెప్పొచ్చు. మరి ఈ వీకెండ్ లో అయితే ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో తొవినో థామస్ హీరోగా నటించగా జూడే అంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. అలాగే తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వారు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు