నితిన్ కెరీర్లో 2021 చాలా స్పెషల్

Published on Feb 23, 2021 3:00 am IST

హీరో నితిన్ బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ ఇవ్వనున్నారు ప్రేక్షకులకు. ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పాలకరించనున్నారు. ఈ నెల 26న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఆయన చేసిన ‘చెక్’ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది ప్రేక్షకుల్ల. లాక్ డౌన్ తర్వాత నితిన్ నుండి వస్తున్న మొదటి సినిమా ఇదే. ఇక మార్చి నెలలో కూడ నితిన్ థియేటర్లలో మెరవనున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన చేసిన ‘రంగ్ దే’ మార్చి 26న విడుదలకానుంది.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నితిన్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ సినిమా మీద కూడ మంచి హైప్ ఉంది. ఈ రెండూ కాకుండా ఈ ఏడాది నితిన్ నుండి ఇంకొక చిత్రం రానుంది. అదే ‘అంధాదూన్’ తెలుగు రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ నెల రెండవ వారంలో విడుదలచేసే యోచనలో ఉన్నారు నిర్మాతలు. నితిన్ చేస్తున్న పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం ఇది. ఇలా ఈ 2021 మొదటి అర్థ భాగంలోనే మూడు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు నితిన్. ఇక రెండవ అర్థభాగంలో కనీసం ఆయన్నుండి ఇంకొక సినిమాను ఆశించవచ్చు. మొత్తానికి నితిన్ కెరీర్లోనే ఈ 2021 స్పెషల్ ఇయర్ అవుతుందనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :