స్టార్ హీరో సినిమాకి 215 అడుగుల కటౌట్ !

Published on May 19, 2019 2:05 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఎన్.జి.కె’ చిత్రం ఈ నెల 31న విడుదలకానుంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు భారీ సంబరాలకు సిద్ధమయ్యారు. తిరుత్తణిలో అయితే ఏకంగా 215 అడుగుల ఎత్తున కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దీని కట్టడం సగం పూర్తైంది. ఇంకో రెండు రోజుల్లో పూర్తి కట్టడం తయారవుతుంది. దీని కోసం 6.5 లక్షల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారు.

‘7జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి పలు హిట్ సినిమాలను రూపొందించిన సెల్వరాఘన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటించారు. 31వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా చిత్రం భారీ ఎత్తున రిలీజవుతోంది.

సంబంధిత సమాచారం :

More