“ఆషికీ ఆ గయి” విధ్వంసం…రెస్పాన్స్ అద్దిరిపోయింది!

Published on Dec 2, 2021 7:00 pm IST


ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మిగతా ప్రాంతాల్లో అదే తరహాలో ఈ చిత్రం దూసుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఈ ఆశికీ ఆ గయి పాట.

ఈ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన ఒక్క రోజులోనే సోషల్ మీడియా లో విపరీతం గా ట్రెండ్ అయ్యింది. అంతేకాక యూ ట్యూబ్ లో 22 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ మధ్య కాలం లో ఈ తరహా వ్యూస్ రాబట్టిన పాట ఇదే అని చెప్పాలి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :