3 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “ఫుల్ బాటిల్” టీజర్

3 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “ఫుల్ బాటిల్” టీజర్

Published on May 30, 2023 6:30 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శరణ్ కొప్పిషెట్టి దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ఫుల్ బాటిల్. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రిపరేషన్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో మొత్తం పంచ్ లతో కామెడీ గా సాగింది. డైరెక్టర్ శరణ్, హీరో సత్యదేవ్ కి మెర్క్యూరీ పాత్రను వివరించిన విధానం వీడియో లో ఆకట్టుకుంటుంది.

మేకర్స్ ఫుల్ బాటిల్ చిత్రం టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ ఇప్పటి వరకూ 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. టీజర్ ఆద్యంతం ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. హీరో పాత్ర మెర్క్యూరీ సూరి ను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం టీజర్ లో చాలా ఆకట్టుకుంటుంది. సినిమా ఎలా ఉండనుంది అనేది టీజర్ ను చూస్తే తెలుస్తుంది. అయితే చిత్రం లోని అసలు కథా, కథనం గురించి తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్, సునీల్, వైవా హర్ష, ప్రియ, రాశి, శ్వేత నాయుడు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు