యూట్యూబ్‌లో మరోసారి దుమ్మురేపుతోన్న ‘జనతా గ్యారెజ్’!

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉండగా, ఈమధ్యే విడుదలైన ఆడియో, ట్రైలర్‌తో ఆ అంచనాలను మరింత పెంచుకుంటూ పోతోంది. ఇక సరిగ్గా నెలరోజుల క్రితం యూట్యూబ్‌లో టీజర్‌తో దుమ్మురేపిన ఈ సినిమా, ఇప్పుడు తాజాగా ట్రైలర్‌తో మరోసారి ఆ ఫీట్ రిపీట్ చేస్తోంది.

ఆగష్టు 12న ఆడియో విడుదల రోజునే విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటివరకూ 3 మిలియన్ (30 లక్షల) వ్యూస్ సాధించింది. లైక్స్ పరంగానూ ఇదే స్థాయిలో దూసుకుపోతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జనతా గ్యారెజ్ ట్రైలర్ ఓ హాట్ టాపిక్‍గా మారిపోయింది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం కూడా జనతా గ్యారెజ్‌కు కనిపిస్తోన్న క్రేజ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: