35 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “కొమురం భీముడో” సాంగ్!

Published on May 15, 2022 6:32 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం మాత్రమే కాకుండా, దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన విడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన కొమురం భీముడో పాటకి యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ పాటకి అన్ని బాషల్లో కలిపి 35 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :