ఇంటర్వ్యూ : 4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌ – ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది !

ఇంటర్వ్యూ : 4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌ – ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది !

Published on Feb 15, 2019 3:08 PM IST

ఆర్‌. ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈశ్వ‌ర్‌ హీరోగా నటించిన చిత్రం ‘4లెట‌ర్స్’. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా యంగ్ హీరో ఈశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

న‌ట‌న‌లో శిక్ష‌ణ ఏమైనా తీసుకున్నారా?

గ‌తేడాది వైజాగ్ స‌త్యానంద్ గారి వ‌ద్ద మూడు నెల‌ల పాటు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకున్నాను. అలాగే యూఎస్ లో ఉన్న‌ప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ అనుభ‌వం ఈ సినిమాకు చాలా ఉపయోగపడింది.

మీ ఫ్యామిలీకి ఇష్ట‌మేనా మీరు సినిమా ఫీల్డ్ లోకి రావ‌డం?

నా గ్రాడ్యుయేష‌న్ కంప్లీట్ అయ్యాక… ఇండియా వెళ్లి సినిమా ట్రైల్స్ నేను చేసుకుంటాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. మా ఫ్యామిలీ కి కూడా సినిమాలంటే చాలా ఇంట్ర‌స్ట్ ఉండ‌టంతో ఓకే అన్నారు. స‌రే ఎవ‌రో ఎందుకు మ‌న‌మే ఒక బ్యానేర్ పెట్టి సినిమా చేద్దాం అని ఈ సినిమా చేశారు.

ద‌ర్శ‌కుడు గురించి చెప్పండి?

ర‌ఘురాజ్ గారు ఫుల్ స్క్రిప్ట్, లొకేష‌న్స్, షెడ్యూల్స్ తో స‌హా వ‌చ్చి క‌లిసారు. ఫ‌స్ట్ సిటింగ్ లో వారి క్లారిటీ అంద‌రికీ న‌చ్చ‌డంతో ఓకే చేశాం. అందులో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ప‌ది సినిమాల‌కు పైగా చేశారు. అంత ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ద‌ర్శ‌కుడుతో సినిమా చేస్తే బావుంటుంద‌నిపించింది. అన్న‌ట్టుగానే వారి ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నా. ఒక యాక్ట‌ర్ కి కావాల్సిన క్వాల‌టీస్ అన్నీ వారే నేర్పించారు. నా ఫ‌స్ట్ సినిమానే బెస్ట్ డైర‌క్ట‌ర్ తో చేశానన్న సంతృప్తి ఉంది.

సినిమా కథ గురించి ?

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ ఇది. ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది. ఏంటి? అన్న క‌థాంశానికి ల‌వ్‌, ఎంట‌ర్ టైన్ మెంట్ మిక్స్ చేసి `4లెట‌ర్స్` సినిమాను తెర‌కెక్కించారు మా డైర‌క్ట‌ర్. స్టూడెంట్స్ త‌ల‌చుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌రు అనే సందేశాన్ని ఫైన‌ల్ గా ఇచ్చాము. స్టూడెంట్స్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. క్లైమాక్స్ లో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.

ట్రైల‌ర్ చూస్తుంటే అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంద‌నిపిస్తోంది?

డైలాగ్స్ తో నే కామెడీ జ‌న‌రేట్ చేసాము త‌ప్ప , విజువ‌ల్ గా అయితే వ‌ల్గారిటీ ఉండ‌దు. ప్ర‌జంట్ యూత్ ఎలా బిహేవ్ చే్స్తున్నారో వారు ఎలా మాట్లాడుకుంటున్నారో అలా సహజంగా ఉంటుంది త‌ప్ప కావాలని డ‌బుల్ మీనింగ్ డైలాగులు పెట్ట‌లేదు.

వెంక‌టేష్ ట్రైల‌ర్ చూసి ఏమ‌న్నారు?

అవునండీ..వెంక‌టేష్ గారికి ట్రైల‌ర్ చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా సలహాలు కూడా ఇచ్చారు. మాట్లాడిన కొద్దిసేపైనా ఒక యాక్టింగ్ క్లాస్ లా అనిపించింది.

నెక్ట్స్ సినిమా మీ బేన‌ర్ లోనే ఉంటుందా?

నేను వైజాగ్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న‌ప్పుడు మా ఫాద‌ర్ వ‌చ్చారు. అక్క‌డ ఎంతో కొత్త‌వారు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఎంతో మంది ప్ర‌తిభావంతులు ఉన్నారు. ఇలాంటి వారికి మ‌న వంతుగా అవ‌కాశం క‌ల్పించాలన్న ఉద్దేశంతో బేన‌ర్ స్టార్ట్ చేశారు. క‌చ్చితంగా నాతో పాటు కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ బ‌య‌ట వాళ్ల‌తో మా బేన‌ర్ లో సినిమాలు చేస్తాం. అలాగే స్టోరీస్ వింటున్నా. ఈ సినిమా విడుద‌ల‌య్యాక నా త‌దుప‌రి సినిమా ప్ర‌క‌టిస్తా. ఇక మీద‌ట హైద‌రాబాద్‌లోను ఉంటూ సినిమాకే అంకిత‌మ‌వ్వాల‌నుకుంటున్నా.

సినిమా రిలీజ్ ఎప్పుడు?

ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నాం. ఎక్క‌డా బోర్ లేకుండా సినిమా ఉంటుంది. మంచి సాంగ్స్ , సినిమ‌టోగ్ర‌ఫీ, కొరియోగ్ర‌ఫీ అన్నీ బాగా కుదిరాయి.

సినిమా రిలీజ్ అవుతోంది క‌దా టెన్ష‌న్ ఏమైనా ఉందా?

కొంచెం టెన్ష‌న్ అయితే ఉంది. కానీ మొద‌టి నుంచి నా మెంటాల్టీ ఏంటంటే ..ఏ ప‌ని చేసిన 100శాతం ఎఫ‌ర్ట్ పెడ‌తాను. కాబ‌ట్టి క‌చ్చితంగా స‌క్సెస్ అవుతామ‌న్న న‌మ్మ‌కం ఉంది. హిట్ట‌యితే నాన్నకు నేనిచ్చే రిట‌న్ గిఫ్ట్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు