మహేష్ “సర్కారు వారి పాట” కళావతి కి సూపర్ రెస్పాన్స్

మహేష్ “సర్కారు వారి పాట” కళావతి కి సూపర్ రెస్పాన్స్

Published on Feb 24, 2022 7:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన మొదటి సారిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో ల కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి కళావతి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి యూ ట్యూబ్ లో క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ యూ ట్యూబ్ లో 45 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. అంతేకాక 1.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అవుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు