‘6 జర్నీ’లో క్లైమాక్స్ హైలైట్ అంటున్న దర్శకుడు బసీర్ ఆలూరి

Untitled 17
యువ నటీనటులు రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘6జర్నీ. బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ.

క్లైమాక్స్ చాలా గొప్పగా ఉంటుంది. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. బోర్డర్‌లో సినిమా షూటింగ్, వర్షాకాలం అవ్వడంతో కాస్త బడ్జెట్ పెరిగింది. అని తాను తెలిపారు.

Exit mobile version