ఫాస్టెస్ట్ 6 మిలియన్ ప్లస్ వ్యూస్ అందుకున్న భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్!

Published on Sep 2, 2021 11:22 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు. టైటిల్ రోల్ నే పోషిస్తూ సినిమా పై భారీ అంచనాలు పెంచేశారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ సింగిల్ కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది.

పవన్ కళ్యాణ్ ఫస్ట్ సింగిల్ 6 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకొని ఇంకా దూకుడు కొనసాగిస్తుంది. అంతేకాక 679కే లైక్స్ తో ఈ ఫస్ట్ సింగిల్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో రానా దగ్గుపాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :