“7 డేస్ 6 నైట్స్” పై సర్వత్రా ఆసక్తి!

Published on Jun 15, 2022 6:13 pm IST

సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం 7 డేస్ 6 నైట్స్. డర్టీ హరి లాంటి చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కావడం తో ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైల్డ్ హానీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. సుమంత్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్త్ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యం గా యూత్ లో ఈ చిత్రం పై ఒక క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం యూత్ లో జూన్ 24, 2022 న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ సైతం వేగవంతం గా జరుగుతున్నాయి. సినిమా చిన్నదే అయినప్పటికీ, పెద్ద సినిమా తరహా లో మంచి బజ్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :