7 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న లెహరాయి సాంగ్!

7 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న లెహరాయి సాంగ్!

Published on Oct 5, 2021 12:00 PM IST

అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం నుండి లెహరాయి అంటూ ఒక లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష ఆదరణ వస్తోంది. ఈ పాట సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. అంతేకాక యూ ట్యూబ్ లో 7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. గోపి సుందర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు. లెహరాయి అనే పాటకు శ్రీమణి లిరిక్స్ రాయగా, సిద్ శ్రీరామ్ పాడారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకం పై బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అంతేకాక ఈ చిత్రం నుండి నెక్స్ట్ సింగిల్ త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు