వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “777చార్లీ”

Published on Jun 4, 2023 8:32 pm IST


రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కిరణ్ రాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన అడ్వెంచర్ కామెడీ డ్రామా 777 చార్లీ. పరంవహ స్టూడియోస్ పతాకంపై జి ఎస్ గుప్తా, రక్షిత్ శెట్టి లు నిర్మించిన ఈ చిత్రం లో సంగీత శృంగేరి హీరోయిన్ గా నటించింది. థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను కూడా రాబట్టడం జరిగింది.

ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. వచ్చే ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగు లో ఈ చిత్రం ప్రసారం కానుంది. నోబిన్ పాల్ సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :