మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది భారీ లెవెల్లో ఇపుడు విడుదలకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో లేటెస్ట్ గా బాలీవుడ్ వెర్సటైల్ నటుడు బొమన్ ఇరానీ రివీల్ చేసిన షాకింగ్ అంశం ఇపుడు వైరల్ గా మారింది. ఈ సినిమా ట్రైలర్ లో బొమన్ ఇరానీపై కొన్ని సన్నివేశాలు చూపించారు.
వాటిలో చిన్న డైలాగ్ ‘క్రాసోవర్ అథ్లెట్’ అంటూ ఆయన గట్టిగా అరుస్తూ చెప్పే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇది మనకి చూసేందుకు సింపుల్ గానే అనిపించవచ్చు కానీ దర్శకుడు బుచ్చిబాబు సానాకి అలా అనిపించలేదట. అందుకే దానికి ఏకంగా 78 టేకులు తనతో తీసుకున్నట్టు తెలిపారు.
ఆ రేంజ్ లో బుచ్చిబాబు పెద్ది కోసం పర్ఫెక్షన్ ని రాబట్టినట్టు బొమన్ చెప్పడంతో సోషల్ మీడియాలో చరణ్ ఫ్యాన్స్ బుచ్చిబాబు వర్క్ విని షాకవుతున్నారు. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే జూన్ 4న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.


