4 మిలియన్లను దాటిన ‘మహర్షి’ !

Published on May 2, 2019 8:00 pm IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా నిన్న మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకూ 4 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను సాధించింది. ఈ మేరకు చిత్రబృందం పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఇక మహర్షి ట్రైలర్ లో మహేష్ వెరీ స్టైలిష్ గా కనిపించాడు. ప్రధానంగా మహేష్ లుక్స్ తోనూ రెండు డిఫరెంట్ షేడ్స్ లోనూ చాలా బాగున్నాడు. ఇక అమాయకుడైన స్టూడెంట్ గా అల్లరి నరేష్ కూడా ఆకట్టుకున్నాడు. అలాగే పూజా పాత్రలో పూజ హెగ్డే కూడా ట్రైలర్ లో చురుగ్గా కనిపించింది. వీరి ముగ్గురి మధ్య స్నేహం కూడా బాగా హైలెట్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న గ్రాండ్ గా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More