సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కానుండగా, ఆ తర్వాత రజనీ వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. కమల్ హాసన్ నిర్మాణంలో ఒక మల్టీస్టారర్ సినిమాతో పాటు, ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.
ముఖ్యంగా దర్శకుడు సిబి చక్రవర్తి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నాడు. రజనీకాంత్ మేకోవర్ కోసం ఆయన ఏకంగా 83 రకాల లుక్స్‌ను డిజైన్ చేయించడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. వీటిలో అత్యుత్తమమైన మూడు లుక్స్‌ను ఫైనల్ చేసి రజనీకి ప్రజెంట్ చేయగా, అందులో ఒక దానిని తలైవా ఖరారు చేయాల్సి ఉంది. ఒక స్టార్ హీరో కోసం ఇంత భారీ స్థాయిలో లుక్ టెస్టులు జరగడం అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు.
అయితే, ఈ ప్రయోగంపై సోషల్ మీడియాలో రజనీ అభిమానుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 75 ఏళ్ల వయసులో రజనీకాంత్‌పై ఇన్ని రకాల లుక్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం అవసరమా అని కొందరు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి సిబి చక్రవర్తి ఫైనల్ చేసే ఆ స్పెషల్ లుక్ తలైవాను ఏ రేంజ్‌లో చూపిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


