ఫ్యాన్సీ ధర పలికిన 90ఎంఎల్ థియరిటికల్ రైట్స్

Published on Nov 14, 2019 10:00 pm IST

యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ 90ఎంఎల్ వచ్చే నెల 5న గ్రాండ్ గా విడుదల కానుంది. హీరోగా కార్తికేయ నుండి వస్తున్న ఈ ఐదవ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. 90ఎంఎల్ మూవీ టీజర్ అలాగే అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఇప్పటికే యూత్ కి బాగా నచ్చేశాయి. కార్తికేయ 90ఎంఎల్ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. దీనితో ఈ చిత్ర థియరిటికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడుబోయాయని సమాచారం.

తాజా సమాచారం ప్రకారం శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్ర థియరిటికల్ రైట్స్ భారీ ధర చెల్లించి దక్కించుకున్నారట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన నేహా సోలంకి నటిస్తుండగా ఎర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై శేఖర్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More