యాక్షన్ అండ్ ఎమోషన్స్- 90ఎంఎల్ ట్రైలర్ తో దుమ్మురేపిన కార్తికేయ

Published on Nov 21, 2019 1:57 pm IST

యంగ్ హీరో కార్తికేయ ఇంకో రెండు వారాలలో 90ఎంఎల్ మూవీ తో ధియేటర్లలో దిగనున్నారు. ఈ ఏడాది కార్తికేయ నటించిన మూడవ చిత్రం 90ఎంఎల్. నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, కార్తికేయ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. వచ్చే నెల5న మూవీ విడుదల నేపథ్యంలో నేడు 90ఎంఎల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

కామెడీ, యాక్షన్ మరియు ఎమోషన్స్ కలగలిసి మూవీ ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఆరోగ్య రీత్యా హీరోకి మూడు పూట్లా మూడు 90ఎంఎల్ ఆల్కహాల్ అవసరం కాగా, అసలు ఆల్కహాలంటేనే గిట్టని ఫ్యామిలీ లో పుట్టిన అమ్మాయిగా హీరోయిన్ కనిపిస్తుంది. మరి వీరిద్దరి ప్రేమకు ఎదురయ్యే సమస్యలే ఈ మూవీ ప్రధాన కథ. కార్తికేయ ట్రైలర్ లో గ్లామర్ మరియు ఎనర్జీ తో ఆకట్టుకున్నారు.నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More