ఆధరైజ్డ్ డ్రింకర్ రేపు ట్రైలర్ తో వస్తున్నాడు !

Published on Nov 21, 2019 12:00 am IST

యంగ్ హీరో కార్తికేయ మరో రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు. 90ఎంఎల్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది. కొద్దిరోజులుగా టీజర్, సాంగ్స్ తో మూవీకి మంచి ప్రచారం కల్పిస్తున్న చిత్ర బృందం రేపు మూవీ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేశారు.

రేపు ఉదయం 10:35 నిమిషాలకు 90ఎంఎల్ ట్రైలర్ విడుదల కానుంది. అనూప్ రూపొందించిన సాంగ్స్ ఇప్పటికే యూత్ లో మంచి ప్రాచుర్యం పొందాయి. కార్తికేయ కి జంటగా నేహా సోలంకి నటిస్తుండగా అజయ్, అలీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. యెర్రా శేఖర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండగా కార్తికేయ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More