తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 96. ప్రేమ్ కుమార్ తెరకేకిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 4న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రంలో విజయ్ సేతుపతి ఫొటోగ్రఫర్ పాత్రలో నటిస్తున్నారు. మద్రాస్ ఎంటర్ ప్రైజస్ పతాకం ఫై నంద గోపాల్ నిర్మిస్తున్న ఈచిత్రానికి గోవింద్ మీనన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈచిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. తాజాగా ఈచిత్రాన్ని చూసిన ఆయన ఈ సినిమా బాగా నచ్చడం తో ఈ రీమేక్ హక్కులను తీసుకున్నారు. మరి ఈచిత్రం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.


