బ్యూటిఫుల్ ట్యూన్ తో “చావు కబురు చల్లగా”.!

Published on Feb 23, 2021 4:20 pm IST

మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తికేయ కూడా ఒకడు. సర్వ సాధారణ యువకుడిగా అయినా డబ్బున్న పవర్ ఫుల్ విలన్ గా అయినా సూపర్బ్ గా సెట్టయ్యే ఈ హీరో ఇప్పుడు చేస్తున్న చిత్రం “చావు కబురు చల్లగా”. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ చిత్రం నుంచి “కదిలే కాలాన్నడిగా” అనే బ్యూటిఫుల్ ట్యూన్ ను లిరికల్ వీడియోను మేకర్స్ వదిలారు.

స్టార్టింగ్ లోనే “పడవై కదిలింది మనసు ఆకాశానికే” అంటూ కౌశిక్ పెగళ్ళపాటి మరియు సనారే రాసిన సాహిత్యం చాలా బాగుంది. ఇక ఇక్కడ నుంచి నీట్ అండ్ క్లీన్ గా జెక్స్ బిజోయ్ ఇచ్చిన సంగీతం బ్యూటిఫుల్ గా మెలోడీషియస్ అనిపిస్తుంది. అలాగే ఇది ఇప్పుడున్న యూత్ లో మంచి ఆదరణ దక్కించుకోవడం కూడా ఖాయం అని చెప్పేలా ఉంది. ఇక ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాణం వహిస్తుండగా మార్చ్ 19న ఈ చిత్రం విడుదల కానుంది.

లిరికల్ వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :