బన్నీ మూవీ కొరకు భారీ సెట్.

Published on Aug 22, 2019 12:23 am IST

అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం, అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ లు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రం కొరకు అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారని తెలుస్తుంది. దాని కోసం ఏకంగా 4.5 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అల వైకుంఠపురంలో లోగో కనిపిస్తున్న ఆ భవనంలో పాటు, ఓ విలేజ్ సెట్ వేశారని ప్రాధమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. మరి ఆ సెట్ దేనికి సంబంధించినదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా అల వైకుంఠపురంలో చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే .

సంబంధిత సమాచారం :

More